HomeతెలంగాణJagadish Reddy: 'కంగ్రాట్స్‌ డాడీ.. మీ గెలుపు మాకు ఆదర్శం'

Jagadish Reddy: ‘కంగ్రాట్స్‌ డాడీ.. మీ గెలుపు మాకు ఆదర్శం’

Sarpanch elections: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తండ్రి గుండకళ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా ఎన్నిక కావడంతో.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని నాగారంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. అయితే శుక్రవారం రాత్రి జగదీష్‌రెడ్డి తన తండ్రి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. 95 ఏండ్ల వయస్సులో మా నాన్న ప్రజాసేవకు అంకితం కావడం స్ఫూర్తిదాయకమని జగదీశ్‌రెడ్డి అన్నారు. సర్పంచ్‌గా 95 ఏళ్ల రామచంద్రారెడ్డి గెలుపు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఆయన గెలుపు మాలాంటి వారికి ఆదర్శమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ రామచంద్రారెడ్డికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

హర్షం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు: 95 ఏండ్ల వయసులో రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించి రికార్డు సృష్టించారని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించటం గొప్ప విషయమని తెలిపారు. అనంతరం గ్రామస్థులు, నియోజకవర్గ, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రామచంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రారెడ్డి వయసుతో సంబంధం లేకుండా సమాజ సేవకు తాను సిద్ధమని నిరూపించుకున్నారని అన్నారు. ఆయన విజయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా గాదరి కిశోర్‌ తెలిపారు.

Also Read: పల్లె పోరులో ఎమ్మెల్యేల ‘హడావుడి’.. తొలి విడత ఫలితాలతో కంగుతిని, రంగంలోకి!

అభినందించిన కేసీఆర్‌: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో గ్రామ ప్రథమ పౌరుడిగా విజయం సాధించారు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచిగా ఆయన గెలుపొందారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రామచంద్రారెడ్డి.. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారుగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి వెంకట భిక్షంపై 136 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. గుంటకండ్ల రామచంద్రారెడ్డి గెలుపు పట్లా బీఆర్‌ఎస్‌ అధినేత హర్షం వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డికి కేసీఆర్‌ ఫోన్‌ చేసి అభినందించారు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News