HomeతెలంగాణKadiyam SriHari: 'రాష్ట్రాన్ని దివాలా తీయించిన కేసీఆర్‌.. జాతిపిత ఎలా అవుతారు.?

Kadiyam SriHari: ‘రాష్ట్రాన్ని దివాలా తీయించిన కేసీఆర్‌.. జాతిపిత ఎలా అవుతారు.?

Kadiyam SriHari on KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను “జాతిపిత” గా అభివర్ణించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ఎలా జాతిపిత అవుతారని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

దేశానికి మహాత్మా గాంధీ ఒక్కరే జాతిపిత అని, ఆయనతో కేసీఆర్‌ను పోల్చడం తగదని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. అవకతవకలు, అక్రమాలు చేసి కుంభకోణాల్లో ఇరుక్కున్నారని విమర్శించారు. అధికారం పోయినా అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని ఇంకా ఎన్ని రోజులు రాజకీయం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ysrcp-chief-ys-jagan-fire-on-chandrababu-government/

‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యారు.? జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. జాతిపిత అయితే ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు.? కేసీఆర్ తన హయాంలో అవకతవకలు, అక్రమాలు చేసి కుంభకోణాలలో ఇరుక్కున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే అది కూలిపోయింది. రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ప్రజలు అధికారం నుంచి దింపినా వారికి ఇంకా అహంకారం తగ్గలేదు.’ అని కడియం శ్రీహరి మండిపడ్డారు. 

Also Read: https://teluguprabha.net/telangana/telangana-assembly-budget-sessions-from-february-26/

కడియం శ్రీహరి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 13 ఏళ్ల పాటు పోరాడిన కేసీఆర్‌పై కడియం శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనలా కేసీఆర్‌ ఎప్పుడూ పార్టీ మారలేదని.. పదవుల కోసం పాకులాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ బరాబర్‌ జాతిపిత అని.. తెలంగాణ సమాజం అంతటిని ఒక తాటి పైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News