HomeTop StoriesCID Investigation: సీఐడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

CID Investigation: సీఐడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

MLA Kaushik Reddy: సీఐడీ విచారణకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. జనవరి 29న హుజూరాబాద్‌లో సమ్మక్క జాతర వేళ గొడవ చోటుచేసుకుంది. పోలీసుల విధుల్లో అడ్డంకి, మతవిద్వేష వ్యాఖ్యలు చేసినట్లు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

- Advertisement -

భార్యతో పాటుగా హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గత నెల చివరి రోజు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్‌ 4న ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. దీంతో కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన భార్య శాలినిరెడ్డి సైతం హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు.

Also read-Telangana: త్వరలో మంత్రివర్గ విస్తరణ.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

సీపీపై మతపరమైన కాంమెంట్స్‌: జనవరి 29న హుజూరాబాద్‌లో సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్న కౌశిక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డ కౌశిక్‌ రెడ్డి హుజూరాబాద్‌ రోడ్డుపై బైఠాయించి.. తన నిరసన తెలిపారు. అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కరీంనగర్‌ సీపీ గురించి మతపరమైన కామెంట్స్‌ చేశారు. ఆ వ్యాఖ్యలను ఐపీఎస్‌ అధికారుల సంఘం సైతం ఖండించింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News