MLA Komatireddy Rajagopal Reddy Comments: నాడు బీఆర్‌ఎస్ నియంత పాలనకు వ్యతిరేకంగా నేను రాజీనామా చేయడం వల్లనే నేడు మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చండూరు మున్సిపాలిటీలో నూతంగా ఏర్పాటు చేసిన వీధి లైట్లను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. “చండూరు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది అన్నారు. ఉప ఎన్నికల్లో ఓడించినప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్న నన్ను తిరిగి గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని తప్పకుండా నిలబెడుతానన్నారు. తాను ఇప్పటివరకు చేసింది తక్కువేనని, ఇంకా చేయాల్సింది చాలా ఉందపి గుర్తు చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. నిధులు మంజూరు చేయలేదన్నారు. నిధులు లేఖ పనులు ఆపితే నా స్వంత నిధులతో పనులు పూర్తి చేస్తానని, ఇచ్చిన హామీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో సర్పంచ్‌లకు నిధులు రాక పనులు పూర్తి చేయటానికి అష్టకష్టాలు పడ్డారన్నారు. రాబోయే రోజుల్లో చండూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వంద పడకల ఆసుపత్రి, సమీకృత మార్కెట్, ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు వంటి హామీలను నెరవేర్చాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సౌకర్యాలు చండూరులో ఉండేలా అభివృద్ధి జరగాలంటే మీ సహకారం ఉండాలని కోరారు.
మంత్రి పదవి అధిష్టానం చేతిలోనే ఉంది..
నియోజకవర్గంలో జరుగుతున్నా రోడ్డు నిర్మాణ పనులకు నిధులు విడుదల చేయాలని సీఎంని కోరానన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు వివరించారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని.. ఇవ్వాళా? వద్దా? అనేది అభిష్టానం చేతిలో ఉందన్నారు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు మాత్రం అన్యాయం చేయొద్దని సీఎంని కోరానన్నారు. మెదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు రానివారికి రెండవ విడతలో ఇళ్లు వచ్చే విదంగా కృషి చేస్తానని తెలిపారు. చేనేత కార్మికుల రుణాలు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మునుగోడు అభివృద్ధికి సహకరించాలని కోరారు.

