- వ్యాధి ముదరకముందే గుర్తిస్తే చికిత్స సులభం: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్….
బేగంపేట్ (తెలుగు ప్రభ): ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు పరీక్షలు చేయిం చుకోవడం అత్యంత అవసరమని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సనత్ నగర్‌లోని సెవెన్ టెంపుల్ ఆవరణలో మాతా సేవాసమితి, రోటరీ క్లబ్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
అప్పుడే చికిత్స సులభం..
ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు వినియోగిస్తున్న అత్యాధునిక వైద్య పరికరాలను ఎమ్మెల్యే పరిశీలించారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ వైద్య వాహనాన్ని సందర్శించి అందులో అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభంగా ఉండటంతో పాటు పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
Also Read: Harish Rao: “రేవంత్, ఉత్తమ్‌లను ఉరి తీసినా తప్పులేదు”
నిర్లక్ష్యం వద్దు: తలసాని
క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రారంభ దశలోనే వైద్యుల సూచనల మేరకు చికిత్స ప్రారంభించి వ్యాధిని అదుపులోకి తీసుకురావచ్చని వివరించారు. కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్‌రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, రమేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, ఖలీల్,మాతా సేవా సమితి నిర్వాహకులు విజయ, రాధిక తదితరులు పాల్గొన్నారు.

