HomeతెలంగాణMLC Candidate Sarvotham Reddy: డిప్యూటీ సీఎంను కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి

MLC Candidate Sarvotham Reddy: డిప్యూటీ సీఎంను కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట, అక్టోబర్ 3 (తెలుగు ప్రభ): హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను నల్గొండ-ఖమ్మం-వరంగల్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార నిర్వహణ, గ్రాడ్యుయేట్ ఓటర్లను సమన్వయం చేసుకోవడం తదితర అంశాలపై ఇరువురూ చర్చించినట్లు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News