HomeTop StoriesKerala: బీజేపీ 'జీరో సీట్ల పార్టీ'.. కేరళలో కమలం ఎప్పటికీ అధికారంలోకి రాదు- శశిథరూర్‌

Kerala: బీజేపీ ‘జీరో సీట్ల పార్టీ’.. కేరళలో కమలం ఎప్పటికీ అధికారంలోకి రాదు- శశిథరూర్‌

Kerala Assembly Elections MP Sashi Tharoor: కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో బీజేపీ కనీసం ఖాతా కూడా ఓపెన్‌ చేయదని జోస్యం చెప్పారు. ఇక్కడ యూడీఎఫ్‌ – ఎల్డీఎఫ్‌ మధ్యే పోటీ నెలకొందని వెల్లడించారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. భారీగా పోలింగ్‌ నమోదు అవుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఇది యూడీఎఫ్‌ అధికారానికి సంకేతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/government-reorganizes-admission-and-fee-regulatory-committee/

గురువారం కేరళతో పాటు పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో మొత్తం 140 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Also Read: https://teluguprabha.net/top-stories/jagityala-jeevan-reddy-sensational-comments-on-cm-revanth-reddy/

‘కేరళ అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు. అది ఒక ‘జీరో సీట్ల పార్టీ’. కేరళలో ప్రధాన పోటీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్(UDF)- అధికారఎల్డీఎఫ్(LDF) కూటముల మధ్యే ఉంటుంది. ఈ రేసులో బీజేపీ అసలు లేదు. కేరళలో బీజేపీకి ఓటు వేయడం అంటే అది సమయాన్ని, ఓటు హక్కును వృథా చేసుకోవడ. ఆ పార్టీకి కింగ్‌మేకర్ అయ్యే బలం కూడా లేదు. ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. భారీగా నమోదవుతున్న పోలింగ్ శాతం మా యూడీఎఫ్ కూటమి విజయానికి సంకేతం.’ అని శశిథరూర్‌ వివరించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News