Wednesday, March 11, 2026
Homeతెలంగాణనల్లగొండMallikarjuna Kharge: నేడు సాగర్ పర్యటనకు మల్లికార్జున ఖర్గే.. బుద్ధవనంలో గడపనున్న ఏఐసీసీ చీఫ్!

Mallikarjuna Kharge: నేడు సాగర్ పర్యటనకు మల్లికార్జున ఖర్గే.. బుద్ధవనంలో గడపనున్న ఏఐసీసీ చీఫ్!

Buddhavanam: ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేడు (సోమవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. నల్లగొండ జిల్లాలోని చారిత్రాత్మక పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని ఆయన సందర్శించనున్నారు. ఖర్గే పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. బుద్ధవనం ప్రాజెక్టు విశిష్టతను తెలుసుకోవడంతో పాటు, రాష్ట్ర స్థాయి నేతలతో కూడా ఆయన క్లుప్తంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖర్గే పర్యటన దృష్ట్యా సాగర్ పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఖర్గే పర్యటన షెడ్యూల్ ఇలా:

  • మధ్యాహ్నం 2:50 గంటలకు: దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • మధ్యాహ్నం 3:30 గంటలకు: శంషాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగార్జునసాగర్‌కు బయలుదేరుతారు.
  • సాయంత్రం 4:00 నుండి 5:00 వరకు: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించి.. అక్కడే గడుపుతారు.
  • సాయంత్రం 5:15 గంటలకు: తిరిగి హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు బయలుదేరుతారు.
  • రాత్రి 6:15 గంటలకు: హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్తారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News