* రాంరెడ్డిపల్లిలో ఘనంగా అవగాహన సదస్సు!
మర్రిగూడ,(తెలుగుప్రభ) :మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం పత్తి సాగుపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు.”కపాస్ కాంతి – మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ”కార్యక్రమంలో భాగంగా ఏఓ సాహాస్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పత్తి పంటలో అధిక దిగుబడులు సాధించడానికి రైతులు సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి,శాస్త్రీయ సాగు విధానాలను అవలంబించాలని సూచించారు.
విత్తనాల మధ్య పాటించాల్సిన సరైన దూరం,అధిక సాంద్రత సాగు విధానం(హై డెన్సిటీ ప్లాంటింగ్)వలన కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ విస్తీర్ణంలోనూ ఎక్కువ లాభాలు గడించవచ్చని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లపంగి నర్సింహా, ఏఈఓ సుజాత,రైతులు వెన్నమనేని సుధాకర్ రావు,యాదగిరి రావు,రామ్మోహన్ రావు,రంగినేని యాదగిరిరావు,కారింగు నర్సింహా, భీమనగోని యాదయ్య,లపంగి పెద్ద యాదయ్య,వడ్డె రవి,నక్క మల్లేష్,ఐతగోని రాములు,లపంగి అనంతం,లింగస్వామి,రాజు,పాండు, ఉపేందర్,శ్రీను,సోంబాబు,శ్రీనివాస్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

