SBI Devarakonda Fraud: నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్‌లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులు అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి రూ. 2.42 కోట్ల నగదు రికవరీ చేశారు. నిందితుల నుంచి 6 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు.
దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) శాఖలో ఇటీవల వెలుగులోకి వచ్చిన భారీ ఆర్థిక మోసం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చక్రపాణి.. అదే బ్రాంచ్‌లో గత మూడేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అటెండర్‌గా పనిచేస్తున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మోసానికి పాల్పడే ముందు చక్రపాణి.. చాలా కాలంగా లావాదేవీలు లేని, మొబైల్ నంబర్ అనుసంధానం లేని ఖాతాలను లక్ష్యంగా చేసుకున్నాడు. బ్యాంకు సిబ్బంది కంప్యూటర్ ఐడీలను ఉపయోగించి, ఆ ఖాతాలకు తన సొంత ఫోన్ నంబర్‌ను అనుసంధానించేవాడు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆ ఖాతాల్లోని నగదును విడతల వారీగా తన స్నేహితుల ఖాతాలకు, అక్కడి నుంచి తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లింపులు చేసేవాడు. అలా మొత్తంగా కస్టమర్ల ఖాతాల్లో నుంచి రూ. 2.65 కోట్ల నగదును అక్రమంగా మళ్లించాడు.
Also Read: https://teluguprabha.net/cinema-news/maker-announced-rajinikanth-jailer-2-shooting-wrapped-up/
హైదరాబాద్‌కు చెందిన ఒక కస్టమర్ ఖాతా నుంచి నగదు బదిలీ అయినప్పుడు అతనికి మొబైల్ సందేశం వెళ్లగా.. వెంటనే బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణలో ఈ భారీ స్కామ్ బయటపడింది. దేవరకొండ బ్యాంక్ మేనేజర్ ఫణీంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడి స్నేహితుడి ఖాతాలో ఉన్న రూ. 89 లక్షలను పోలీసులు వెంటనే ఫ్రీజ్ చేశారు.
దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.ప్రధాన నిందితుడు చక్రపాణితో సూర్యాపేట SBI మెయిన్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా ఉన్న రామాంజనేయులు సూర్యపేట SBI మొయిన్ బ్రాంచ్‌లో మేనేజర్, రికవరీ ఏజెంట్ కేతవత్ రామ్ లాల్, ఫొటోగ్రాఫర్ శివ ఈ మోసంలో పాలుపంచుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

