HomeTop StoriesTragedy: వరి కొయ్యలకు నిప్పు పెట్టిన రైతు.. ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి

Tragedy: వరి కొయ్యలకు నిప్పు పెట్టిన రైతు.. ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి

Tragedy in Nalgonda District: ఆరుగాలం పండించిన పంట ప్రతిఫలాన్ని చూసుకునే భాగ్యం ఆ రైతుకి దక్కలేదు. ధాన్యం కుప్పలు ధనలక్ష్మీగా ఇంట్లో అడుగుపెట్టి ఆ సంపదను కళ్లనిండా చూడకముందే కానరానిలోకాలకు చేరాడు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం జి. కొత్తపల్లిలో చోటుచేసుకున్న విషాదకర సంఘటన కుటుంబీకులను శోకసంద్రంలో ముంచెత్తింది. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో వరికొయ్యల మంటల్లో చిక్కుకుని రైతు అక్కడికక్కడే మరణించారు. తన ఆరెకరాల పొలంలో పంట కోయగా మిగిలిపోయిన వరికొయ్యలను తగులబెట్టేందుకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు వేగంగా వ్యాపించి ఊపిరాడక, ఆ మంటల్లో చిక్కుకుని రైతు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/business/sebi-approves-rs-11000-crore-zepto-ipo/

కాగా, పంట కోతల తర్వాత పొలాల్లో వరికొయ్యలను తగులబెట్టే సమయంలో రైతులు ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా కొన్ని సూచనలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. 

భూమి సారం క్షీణత: పొలంలోనే వరికొయ్యలను తగులబెట్టడం వల్ల భూమిలోని మిత్రపురుగులు చనిపోయి నేల సారం దెబ్బతింటుందని అధికారులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు రోటవేటర్ సహాయంతో వాటిని భూమిలోనే దున్నేయడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నిప్పు పెట్టాల్సి వస్తే, వేసవికాలంలో గాలి వేగంగా వీచే సమయంలో అస్సలు నిప్పు పెట్టకూడదని హెచ్చరించారు.

Also Read: https://teluguprabha.net/business/maruti-suzuki-car-prices-hike/

ఒంటరిగా వెళ్లొద్దు: వరికొయ్యలకు లేదా వ్యర్థాలకు నిప్పు పెట్టే సమయంలో ఎప్పుడూ ఒంటరిగా వెళ్లకూడదని.. తోడుగా మరికొంత మందిని తీసుకెళ్లాలి. మంటలు అదుపు తప్పితే వెంటనే ఆర్పడానికి వీలుగా నీటిని లేదా పారలు, పచ్చి కొమ్మలను సిద్ధంగా ఉంచుకోవాలి. మంటలు పక్క పొలాల్లోకి లేదా సమీపంలోని గడ్డివాములకు వ్యాపించకుండా పొలం చుట్టూ కొంత భాగాన్ని ముందే శుభ్రం చేసుకోవడం ఉత్తమం. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News