యాదగిరిగుట్ట (తెలుగుప్రభ): శ్రీలక్ష్మీ నరసింహా స్వామివారి యాదగిరిగుట్ట ఆలయంలో ప్రధాన అర్చక బృందం కణ్ణన్ (శ్రీకృష్ణాష్టమి వేడుకలు) తిరునక్షత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాంచారాత్రాగమన రీతిలో త్రయాహ్నిక దీక్షతో ఇక్కడి ఆలయంలో చేపట్టడం ఆచారంగా వస్తోంది. సాయంత్రం ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం అనంతరం స్వామివారికి నవకలశ స్నాపనం, మూలమంత్ర, మూర్తి మంత్ర హవనాలు చేపట్టిన పూజారులు పూర్ణాహుతి జరిపారు. సాయంత్రం 7గంటల నుంచి శ్రీకృష్ణ ఆవిర్భావ మహోత్సవం నిర్వహించిన సందర్భంగా చతుర్వేద పారాయణం, దివ్య ప్రబంధ పాశుర పఠనం, ప్రత్యేక అర్చన, నివేదనలు, మంగళశాసనం, చాత్మార, తనీయ విన్నపం తీర్థ గోష్టితో కార్యక్రమం ముగిసింది. ప్రాకార మండపంలోని అద్దాల మండపంలో నెలవంక, రోహిణి నక్షత్రాన్ని వేసి శ్రీకృష్ణుడు (కణ్ణన్)కి ఉత్సవాలు జరిపారు. 12రకాల బోగాలతో స్వామివారికి నివేదన చేపట్టిన ఆర్చకులు గోశాలలోని గోవులకు ఆలయ అధికారులు పూజలు చేశారు. కార్యక్రమంలో ఈవో జే. భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, డీఈవో దోర్బల భాస్కరశర్మ, ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు, డీఈవో దొర్భల భాస్కర శర్మ, ఏ ఈ లో దొమ్మాట సురేందర్ రెడ్డి, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
స్వామివారి సేవలో ప్రముఖులు..
స్వామివారిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, భారత విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అల్పాదుబే వేర్వేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధానార్చకుడు బట్టర్ సురేంద్ర చార్యులు బృందం సాంప్రదాయ స్వాగతం పలికారు. స్వయంభువులకు ప్రత్యేక పూజలు చేశారు. వీరికి వేద మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా దేవస్థానం ఈవో జై భవాని శంకర్ లడ్డు ప్రసాదం అందజేశారు.


