Thursday, March 12, 2026
Homeతెలంగాణనల్లగొండAccident: జాతరకు వెళ్లి వస్తుండగా విషాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. దంపతులు మృతి

Accident: జాతరకు వెళ్లి వస్తుండగా విషాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. దంపతులు మృతి

Nalgona Accident: నల్గొండ జిల్లాలోని హాలియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/warangal-news/congress-won-municipalities-in-jangaon-and-thorrur-through-lottery/

జాతరకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన హాలియాలో చోటుచేసుకుంది. సాగర్‌ ఎడమ కాలువ వంతెనపై మంగళవారం మధ్యాహ్నం బైక్‌పై వెళ్తుండగా.. అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు. అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన దంపతులు వెంకటయ్య(55), మల్లమ్మ(45)గా పోలీసులు గుర్తించారు. బంటుగూడెం జాతరకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News