మోత్కూరు, ( తెలుగు ప్రభ ): మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు నోచుకోలేక తమ చదువులను ఇంటర్మీడియట్ వరకే స్వస్తి చెప్పవలసిన స్వస్తి చెప్పవలసిన వస్తుంది. ఇక్కడ డిగ్రీ కళాశాల లేక ఉన్నత విద్య కోసం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఫీజుల మోతతో ఆశ్రయించలేని పరిస్థితి ఏర్పడింది. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యకు నోచుకోవాలంటే మోత్కూరుకు 50 కి.మీ. దూరంలో ఉన్న రామన్నపేట,నల్లగొండ, ఆలేరు 100 కి.మీ.హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు వెళ్తున్నారని తద్వారా త్రీవ ఇబ్బందులు పడుతున్నారు.
మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని 1985 నుంచి 2026 వరకు ఏఐఎస్ఎఫ్,ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, పి.డి.ఎస్.యు.బీసీ విద్యార్థి సంఘం, బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో తరగతుల బహిష్కరణ, ధర్నాలు,రాస్తారోకో,ప్లకార్డు ప్రదర్శన, సంతకాల సేకరణ, తహశీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ వినతి పత్రాలను అందజేశారు. ఈ దశల వారీగా ఉద్యమంలో బాగంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ మంత్రులకు వినతి పత్రాలను అందజేయడంతో పాటు ముఖ్యమంత్రులకు పోస్ట్ కార్డులు పంపించారు.
ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల మోత్కూరు మండలానికి అనుసంధానంగా ఉన్న గుండాల, ఆత్మకూరు (ఎం), అడ్డగూడూరు మండలాలకు మండలాల విద్యార్థులకు మంచి సౌకర్యంగా ఉంటుంది. గత నాలుగున్నర దశాబ్దాలుగా 1985 నుంచి 2024 ఈ ప్రాంతం నుండి పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే, కూడా ఎంపీ అభ్యర్థులు మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారే తప్పా…అమలు చేయడంలో పూర్తిగా విఫలమైయ్యారు.ఈ ప్రాంత విద్యార్థులకు చిరకాల వాంఛనైనా మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయుటకు ప్రజా ప్రతినిధులు అధికారులు,కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలి
నిలిగొండ మత్స్యగిరి బీసీ రిజర్వేషన్ సాధన సమితి పట్టణ అధ్యక్షులు మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకో లు అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై ఎంపీ ఎమ్మెల్యే మంత్రులకు వినతి పత్రాలతో పాటు ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డులు పంపించాం. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలి.

పోరాటాలతో డిగ్రీ కళాశాల సాధిస్తాం
ఉప్పల శాంతి కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గత నాలుగున్నర దశాబ్దాల నుండి అనేక విద్యార్థి సంఘాలతో పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు ప్రజా ప్రతినిధులు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైయ్యారు. ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం తమ సంఘం ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు నిర్వహించి కళాశాల సాధిస్తాం.

