Homeతెలంగాణనల్లగొండTelangana: క్షణికావేశం..విద్యార్థిని అనంత లోకాలకు

Telangana: క్షణికావేశం..విద్యార్థిని అనంత లోకాలకు

మర్రిగూడ,(తెలుగుప్రభ):హాస్టల్‌కు వెళ్లి చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మర్రిగూడ మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం..లెంకలపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల మౌనిక (19) సూర్యాపేటలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

- Advertisement -

గత కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటున్న మౌనిక,తిరిగి హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేక తీవ్ర మనస్తాపానికి గురైంది.​బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుంది.గమనించిన కుటుంబ సభ్యులు చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది.సమాచారం అందుకున్న ఎస్ఐ రాంబాబు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.చేతికి వచ్చిన కుమార్తె కళ్లముందే విగతజీవిగా పడిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News