HomeతెలంగాణPublic Grievance Program: అధికారులు సిద్ధం.. దరఖాస్తుదారుల జాడేది..?

Public Grievance Program: అధికారులు సిద్ధం.. దరఖాస్తుదారుల జాడేది..?

నల్లబెల్లి, అక్టోబర్ 5 (తెలుగు ప్రభ): నల్లబెల్లి మండలంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి స్పందన కరువవుతోంది. ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు అందరూ హాజరై సిద్ధంగా ఉన్నారు. అయితే దరఖాస్తుదారులు మాత్రం రాకపోవడం గమనార్హం. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో అధికారులు దరఖాస్తుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

- Advertisement -

ప్రజావాణిలో దరఖాస్తు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్న భావనతో ప్రజలు దూరంగా ఉంటున్నారా? లేక ప్రజావాణి కార్యక్రమంపై అవగాహన లేక రావడం లేదా? అన్నది ఉన్నతాధికారులు పరిశీలించాల్సిన అంశంగా మారింది. ప్రజావాణి ప్రారంభమైన నాటి నుంచి నల్లబెల్లి మండలంలో దరఖాస్తుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సెప్టెంబర్ 28న కేవలం ఒక రెవెన్యూ దరఖాస్తు మాత్రమే వచ్చింది. అంతకుముందు దరఖాస్తుల సంఖ్య 8 నుంచి సున్నాకు, ఆ తర్వాత 2కు చేరిన పరిస్థితి ఉంది. ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన వేదికకు దరఖాస్తులు రాకపోవడం ప్రజావాణి లక్ష్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

ప్రజలు సక్రమంగా ప్రజావాణిని వినియోగించుకోకపోతే భవిష్యత్తులో మండలంలో ప్రజావాణి నిర్వహణపై ఉన్నతాధికారులు పునరాలోచించే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ప్రజావాణి ప్రాధాన్యత, దరఖాస్తు విధానం, సమస్యల పరిష్కార ప్రక్రియపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని పలువురు సూచిస్తున్నారు. ప్రజల సమస్యలకు వేదికగా నిలిచే ప్రజావాణికి మళ్లీ స్పందన పెరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News