Nampally police: సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఇవాళ మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఏడున్నర గంటలు కొనసాగిన విచారణ: నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో బాల్క సుమన్‌ను పోలీసులు మధ్యాహ్నం నుంచి సుమారు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణ ముగిసిన అనంతరం.. నిబంధనల ప్రకారం బాల్కసుమన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు పూర్తయిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు సుమన్‌ను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also read-Balka Suman arrest: బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్.. నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు..!
నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత!: మరోవైపు బాల్క సుమన్‌ను తక్షణమే విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు నాంపల్లి పోలీస్ స్టేషన్ వెలుపల భారీగా ఆందోళనకు దిగాయి. సుమన్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్న తరుణంలో.. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి వాహనాన్ని ముందుకు పంపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

