HomeతెలంగాణInvestigation : దారుణం.. నర్సు హత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ గర్జన

Investigation : దారుణం.. నర్సు హత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ గర్జన

NCW suo motu cognizance nurse case :  విధి నిర్వహణలో ఉన్న నర్సుపై జరిగిన హేయమైన హత్యాచార ఉదంతాన్ని జాతీయ మహిళా కమిషన్ (NCW) అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ దారుణంపై కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (DGP)కి అధికారికంగా లేఖ రాశారు.

- Advertisement -

వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం : ఈ అమానుష ఘటనకు పాల్పడిన మృగాళ్లను తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా కచ్చితమైన కాలపరిమితితో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. నిందితులకు న్యాయస్థానంలో కఠిన శిక్ష పడేలా నిరూపించేందుకు పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ అంశాలు, సాంకేతిక (డిజిటల్) ఆధారాలను పఠిష్టంగా భద్రపరచాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు చేపట్టిన కార్యాచరణ, సాధించిన పురోగతిపై 7 రోజుల్లోగా సమగ్రమైన ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ (ATR) సమర్పించాలని డీజీపీని కమిషన్ ఆదేశించింది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, ఈ కేసును నిరంతరం పర్యవేక్షిస్తామని ఎన్‌సీడబ్ల్యూ తేల్చిచెప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News