HomeతెలంగాణMalla Reddy University: మల్లారెడ్డి యూనివర్సిటీలో సరికొత్త ఏఐ కోర్సులు.. ఈరోస్ ఏఐ విద్య భాగస్వామ్యంతో...

Malla Reddy University: మల్లారెడ్డి యూనివర్సిటీలో సరికొత్త ఏఐ కోర్సులు.. ఈరోస్ ఏఐ విద్య భాగస్వామ్యంతో ఫ్యూచర్-రెడీ ప్రోగ్రామ్స్

New AI Courses in Malla Reddy University: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను డిజిటల్ నైపుణ్యాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం (Malla Reddy University) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సంస్థ ఈరోస్‌ ఏఐ విద్య (EROS AI VIDYA) తో జతకట్టింది. ఇరోస్‌ ఏఐ విద్య భాగస్వామ్యంతో క్రియేటివ్ మీడియా, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్‌, గేమింగ్ వంటి రంగాల్లో సరికొత్త ఇండస్ట్రీ-ఓరియెంటెడ్ కోర్సులను ప్రారంభించింది. నేటి గ్లోబల్ ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులను దృష్టిలో పెట్టుకొని, అత్యాధునిక ఏఐ టూల్స్, టెక్నాలజీని సృజనాత్మకతతో జోడించి ఈ ప్రోగ్రామ్స్‌ను డిజైన్‌ చేసింది.

- Advertisement -

కొత్త కోర్సులపై ఎవరేమన్నారంటే?

మల్లారెడ్డి విశ్వవిద్యాలయం చైర్మన్ డాక్టర్‌ భద్రారెడ్డి మాట్లాడుతూ.. “చదువుకు, పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే మా లక్ష్యం. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు ఎక్స్‌పర్ట్స్‌ చేత రియల్ టైమ్ ప్రాజెక్టులు, అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్‌పై శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది.” అని పేర్కొన్నారు.

వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. “ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఫిలిం మేకింగ్, యానిమేషన్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్ పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న కంపెనీలన్నీ కేవలం డిగ్రీ ఉన్న వారి కోసం కాకుండా, టెక్నాలజీపై పట్టు ఉండి కొత్తగా ఆలోచించే వారిని రిక్రూట్‌ చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నాయి. అందుకే మేము ఈరోస్‌ ఏఐ విద్యాతో కలిసి ఈ ప్రత్యేకమైన కోర్సులను రూపొందించాం. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మా విద్యార్థులు కేవలం థియరీ మాత్రమే కాకుండా, ఏఐ టూల్స్‌ను ఎలా వాడాలి? గ్లోబల్ మార్కెట్‌లో ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి? అనే అంశాలపై పూర్తిస్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ పొందుతారు. విద్యార్థులు తమ కెరీర్‌లో ఉన్న స్థాయికి చేరుకోవడానికి, దేశం గర్వించదగ్గ క్రియేటర్లుగా మారడానికి ఈ కోర్సులు ఒక బలమైన పునాదిగా నిలుస్తాయని నమ్ముతున్నాను.” అని తెలిపారు.

యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ డాక్టర్ సుధా రమణ మాట్లాడుతూ.. “సాంకేతికతను సాధారణ విద్యలో భాగం చేస్తూ, విద్యార్థుల్లో క్రియేటివిటీ, వ్యాపార దృక్పధాన్ని పెంపొందించడానికి ఇది ఒక గొప్ప వేదిక.” అన్నారు.

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అనిల్ కౌల్ మాట్లాడుతూ.. “అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సరికొత్త సిలబస్‌ను రూపొందించాం. విద్యార్థులకు ఆధునిక ప్రొడక్షన్ విధానాలు, ఏఐ టూల్స్‌పై పూర్తి అవగాహన కల్పిస్తాం.” అని పేర్కొన్నారు.

ఈరోస్‌ ఏఐ విద్య సీఈవో ప్రశాంత్ పండిట్ మాట్లాడుతూ.. “నేటి టెక్నాలజీ యుగంలో ఊహలకు సాంకేతికతను తోడు చేయగలిగే వారికే భవిష్యత్తు ఉంటుంది. అడ్వర్జైజ్‌మెంజ్‌, గేమింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఈ కోర్సులు నేర్చుకున్న వారికి లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి. డిజిటల్ యుగంలో విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా మార్చేందుకు, భారతీయ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు (Creative Economy) సహకరించేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఇటువంటి వినూత్న కార్యక్రమాలతో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. మల్లారెడ్డి యూనివర్సిటీతో జతకట్టి ఈ వినూత్న కోర్సులను ప్రారంభించడం ఆనందంగా ఉంది.” అని తెలిపారు.

విద్యార్థులకు లభించే ప్రయోజనాలివే..

లైవ్ ప్రాజెక్టులు: థియరీతో పాటు ప్రాక్టికల్ అనుభవం కోసం లైవ్ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు.

అత్యాధునిక స్టూడియోలు: లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ కలిగిన ల్యాబ్స్.

కెరీర్ గైడెన్స్: సినీ, మీడియా రంగ నిపుణుల నుండి మెంటార్‌షిప్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News