HomeTop StoriesNitin Nabin: అధికారమే లక్ష్యంగా పోరాడాలి.. తెలంగాణ బీజేపీ శ్రేణులకు నితిన్‌ నబీన్‌ పిలుపు

Nitin Nabin: అధికారమే లక్ష్యంగా పోరాడాలి.. తెలంగాణ బీజేపీ శ్రేణులకు నితిన్‌ నబీన్‌ పిలుపు

Nitin Nabin calls upon BJP cadres in Telangana: 2028లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలోని బీజేపీ శ్రేణులు పోరాడాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాపోరాటాలు చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ్‌ భారత్‌ లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయాలను నితిన్‌ నబీన్ ఏకకాలంలో‌ వర్చువల్‌గా ప్రారంభించారు.

- Advertisement -

Also Read: Nitin Nabin : కదనరంగాన కమలదళం.. తెలంగాణలో త్వరలో కాషాయ కేతనం!

పశ్చిమ బెంగాల్‌ స్ఫూర్తితో అధికారంలోకి రావాలి..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజాసేవ, పోరాటాల ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి రాగలం. పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ప్రతి కార్యకర్త సంకల్పం తీసుకోవాలి. పశ్చిమ బెంగాల్‌లో కార్యకర్తల కృషితోనే బీజేపీ ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ పోరాటం చేసి అధికారంలోకి రావాలి. పశ్చిమ బెంగాల్‌ మాదిరిగానే త్వరలో తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరాలి. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. లోక్‌సభలో రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్తానం నేడు భారతదేశమంతటా అప్రతిహతంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుష్మాస్వరాజ్‌ ఎంతో పోరాడారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వల్లే తెలంగాణ కల సాకారమైంది.’’ అని నితిన్‌ నబీన్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News