Car Blast while filling Gas: కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లిలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారులో ఎల్‌పీజీ గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా ట్యాంకర్ పేలిపోయి, మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో మరో మూడు వాహనాలు దగ్ధమయ్యాయి.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-plans-to-make-hyderabad-a-signal-free-city/
శనివారం మధ్యాహ్నం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో మారుతి ఓమ్ని కారులో ఎల్‌పీజీ గ్యాస్ నింపుతుండగా ట్యాంకర్ పేలింది. పేలుడు తీవ్రతకు గ్యాస్ నింపుతున్న కారుతో పాటు, పక్కనే పార్క్ చేసి ఉన్న మరో రెండు కార్లు, ఒక బైక్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. భారీ శబ్దంతో మంటలు ఎగిసిపడటంతో సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/vck-party-in-tamilnadu-politics/
కాగా, వేసవి కాలం దృష్ట్యా అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాహనాల కండిషన్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని చెబుతున్నారు.

