ఏర్గట్ల,(తెలుగు ప్రభ): విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉన్నత భవిష్యత్తు కోసం విశేష కృషి చేసిన జక్కుల గంగా ప్రసాద్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. రేపు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో గంగా ప్రసాద్‌ను ఘనంగా సన్మానించనున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గంగా ప్రసాద్ చేసిన సేవలను గుర్తించిన అధికారులు ఆయనను జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా ఆయనకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కడంపై తడపాకల్ గ్రామస్థులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

