Homeతెలంగాణనిజామాబాద్‌Kamareddy: జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాలపై శిక్షణ

Kamareddy: జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాలపై శిక్షణ

కామారెడ్డి,(తెలుగు ప్రభ ): కామారెడ్డి జిల్లాలోని జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంతో పాటు ఆధునిక మీడియా విధానాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.

- Advertisement -

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి బాన్సువాడ శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిజం రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వార్తల సేకరణ, వాస్తవ నిర్ధారణ, వార్తా ప్రసారం తదితర అంశాలపై జర్నలిస్టులకు శిక్షణ అందించారు.

ప్రస్తుతం మీడియా రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం పెరుగుతున్న క్రమంలో వార్తలను వేగంగా అందించడంతో పాటు వాటి వాస్తవికతను నిర్ధారించుకోవడం, బాధ్యతాయుతంగా వార్తలను ప్రచురించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం, మారుతున్న మీడియా పరిస్థితులకు అనుగుణంగా పనిచేసేలా వారిని తీర్చిదిద్దడం శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News