Homeతెలంగాణనిజామాబాద్‌Kamareddy: పంచాయతీ సిబ్బంది ప్రభుత్వ పనులకా.. వ్యక్తిగత పనులకా?

Kamareddy: పంచాయతీ సిబ్బంది ప్రభుత్వ పనులకా.. వ్యక్తిగత పనులకా?

కామారెడ్డి, (తెలుగు ప్రభ):ప్రజలకు సేవలందించాల్సిన పంచాయతీ సిబ్బందిని వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు భిక్కనూర్ మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ కార్యాలయ విధులు, గ్రామ పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అవసరమైన సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిమగ్నమై ఉండాల్సిన సిబ్బందితో ఓ అధికారి వ్యక్తిగత పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇటీవల పంచాయతీ సిబ్బందితో అధికారి తన కారును శుభ్రం చేయించుకుంటున్న దృశ్యం స్థానికంగా చర్చకు దారితీసింది. ప్రజాధనం నుంచి వేతనాలు పొందుతున్న సిబ్బంది ప్రభుత్వ విధులకే పరిమితం కావాల్సి ఉండగా, వ్యక్తిగత పనులకు వినియోగించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారిక విధులకు కేటాయించిన సిబ్బందిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునే అధికారం ఎవరికుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

అధికారమా.. అధికారం దుర్వినియోగమా?

పంచాయతీ సిబ్బంది తమ విధుల్లో భాగంగా ప్రజలకు సేవలు అందించాల్సి ఉండగా, వ్యక్తిగత పనులకు వినియోగిస్తే ప్రభుత్వ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు నిజమైతే సిబ్బందిపై అధికార ఒత్తిడి తెచ్చి వ్యక్తిగత పనులు చేయించడం అధికార దుర్వినియోగం కిందకు వస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఉన్నతాధికారులు స్పందించాలి

పంచాయతీ సిబ్బందిని వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవం ఉంటే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వాస్తవం లేకపోతే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది ప్రజల కోసం పనిచేయాల్సిందే తప్ప అధికారుల వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకునే పరిస్థితి ఉండకూడదని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News