Homeతెలంగాణనిజామాబాద్‌Leopard attack: సామ దుబ్బ తండాలో చిరుత పులి బీభత్సం.. మూడు లేగదూడలు మృతి!

Leopard attack: సామ దుబ్బ తండాలో చిరుత పులి బీభత్సం.. మూడు లేగదూడలు మృతి!

Kamareddy: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని సామ దుబ్బ తండాలో ఆదివారం అర్ధరాత్రి చిరుత పులి బీభత్సం సృష్టించింది. తండాకు చెందిన రమావత్ రమేష్ అనే రైతుకు చెందిన మూడు లేగ దూడలపై చిరుత దాడి చేసి హతమార్చింది.

- Advertisement -

సామ దుబ్బ తండాలో చిరుత పులి బీభత్సం: బాధితుడు రమేష్ ఆదివారం రాత్రి తన పశువుల పాకలో లేగ దూడలను కట్టివేసి ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో పాకపై దాడి చేసిన చిరుత పులి.. రెండు లేగ దూడలను అక్కడికక్కడే చంపేసింది. మరో దూడను కొంతదూరం లాక్కెళ్లి హతమార్చినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ దాడి వల్ల తనకు సుమారు రూ. 50 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. తాను కూలి పనులు చేసుకునే నిరుపేదనని అన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రమేష్ వేడుకున్నాడు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్: సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ జాదవ్ రేణుక గణపతి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అటవీ ప్రాంతానికి సమీపంలో తండాలు ఉండటంతో చిరుత పులుల సంచారం ఎక్కువైందని తెలిపారు. దీంతో తండావాసులు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారని పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి తండావాసులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

Also read-Telangana: పోలీసుల హై అలర్ట్‌.. రాష్ట్రవ్యాప్తంగా 203 చెక్ పోస్టులు!

అటవీశాఖపై గ్రామస్థుల ఆగ్రహం: గతంలో కూడా ఈ ప్రాంతంలో వన్యప్రాణులు పశువులపై దాడులు చేసినా.. అటవీశాఖ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం అవ్వాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నష్టపోయిన రైతు కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News