Homeతెలంగాణనిజామాబాద్‌Kamareddy : దుర్గామాత ఉత్సవాలకు ముస్లిం సోదరుడి విరాళం

Kamareddy : దుర్గామాత ఉత్సవాలకు ముస్లిం సోదరుడి విరాళం

గాంధారి, (తెలుగు ప్రభ): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో దుర్గామాత ఉత్సవాలకు ముస్లిం సోదరుడు ఆర్థిక సహాయం అందించి మతసామరస్యాన్ని చాటుకున్నారు. నవజవాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి గ్రామ సర్పంచ్ పఠాన్ అంజాద్ ఖాన్ రూ.15 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు అభినందించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు దుంపల రవి, నవజవాన్ యూత్ నాయకులు దుంపల నవీన్, దుంపల పెద్ద సాయిలు, సింగసాని విట్టల్, కమ్మరి పండరి, చెంచాల దత్తు, తోడంగల సాయిలు, బండారి తుకారాం, మల్లెబోయిన సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News