Nizamabad Municipal Corporation: నిజామాబాద్ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు కార్పొరేషన్‌ను అధికార కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించినా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ vs బీజేపీ మధ్య హోరాహోరా పోటీ సాగి చివరికి ‘హస్త’గతమైంది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మేయర్‌గా ఆ పార్టీకి చెందిన 49వ వార్డు కార్పొరేటర్ ఉమారాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా 54వ కార్పొరేటర్, ఎంఐఎం అభ్యర్థి సల్మా తహసీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/warangal-news/tension-in-thorrur-and-jangaon-municipalities/
కాగా, నిజామాబాద్‌లో మొత్తం 60 డివిజన్లకు గాను బీజేపీ 28 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో గెలుపొందాయి. మెజారిటీకి అవసరమైన సంఖ్య(31) ఏ పార్టీకి రాకపోవడంతో హంగ్ ఏర్పడి.. స్వతంత్రులు, మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది. దీంతో కాంగ్రెస్ ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని చేపట్టకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశకు దారితీసింది.

