Homeతెలంగాణనిజామాబాద్‌Police special checks: నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు

Police special checks: నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు

  • 100కు పైగా ద్విచక్ర వాహనాలు స్వాధీనం
  • నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు

కామారెడ్డి (తెలుగు ప్రభ): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దేవునిపల్లి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి 100కు పైగా వాహనాలను స్వాధీనం చేసుకుని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధిస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. కొన్ని వాహనాలకు పోలీసుల ఆధ్వర్యంలో దగ్గరుండి నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో దేవునిపల్లి సీఐ శ్రీధర్ గౌడ్, ఎస్సైలు రంజిత్, బాల్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ గౌడ్‌తో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Also read: Jupally Krishna Rao: అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తున్నాం.. మంత్రి జూపల్లి కృష్ణారావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News