HomeTop StoriesRoad Accident: శుభకార్యానికి వెళ్తుండగా విషాదం.. ఆటో బోల్తా పడి తల్లీకుమారుడి మృతి

Road Accident: శుభకార్యానికి వెళ్తుండగా విషాదం.. ఆటో బోల్తా పడి తల్లీకుమారుడి మృతి

Road Accident Kamareddy District: శుభకార్యానికి వెళ్తుండగా దారి కాచిన మృత్యువు తల్లీకుమారుడిని బలితీసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరి మృతితో పాటు 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/union-minister-nirmala-clarity-on-bank-lockers-insurance-coverage/

తాడ్వాయి మండల శివారులో సోమవారం సాయంత్రం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు ఆమె కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News