Homeతెలంగాణనిజామాబాద్‌Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కష్టాలు..

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కష్టాలు..

ఎండిపోతున్న పంటలు
రైతుల సమస్యలను అధికారులపై నెట్టడం సరికాదు:
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

- Advertisement -

కామారెడ్డి, (తెలుగు ప్రభ ):రాష్ట్రంలో విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సరిపడా విద్యుత్ అందక రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను బెదిరిస్తూ సస్పెన్షన్లకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై నెట్టడం సరికాదని అన్నారు. పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తూ, రైతుల పంటలను కాపాడేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగునీరు, విద్యుత్ కొరత లేకుండా చూడటానికి అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్‌లో రైతులు అర్ధనగ్నంగా, తలకిందులుగా నిలబడి నిరసన తెలిపారని పేర్కొన్నారు. మాచారెడ్డి ప్రాంతంలో ఓ రైతు జనరేటర్‌ను ఏర్పాటు చేసుకుని పంటను కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాల్లో 6 నుంచి 7 గంటల వరకే విద్యుత్ సరఫరా అవుతోందని, మరో పది రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పారు. రైతులే స్వయంగా సబ్‌స్టేషన్ల వద్దకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లెక్కలు లేకుండా బయటకు వెళ్లిందని ఆరోపించిన గంప గోవర్ధన్, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించి పంటలను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News