Homeతెలంగాణనిజామాబాద్‌Suicide: కుటుంబ కలహాలు.. నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య

Suicide: కుటుంబ కలహాలు.. నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య

Young man Suicide: కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. లింగంపేట మండలం మోతె గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/petrol-diesel-prices-increased-by-rs-3-across-the-country/

గ్రామానికి చెందిన తిలిపీతియా ఇంద్రజీత్‌ సింగ్‌(28), అతని భార్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో  కుటుంబసభ్యులను బయటకు పంపిన ఇంద్రజిత్ సింగ్‌.. అనంతరం మనస్తాపంతో గదిలోకి వెళ్లి నాటు తుపాకీతో కాల్చుకున్నాడు. ఛాతీపై కాల్చుకోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

Also Read: https://teluguprabha.net/telangana/dgp-cv-anand-reviews-the-performance-of-greyhounds-and-octopus/

కాగా, భర్త మృతి తట్టుకోలేక అతని భార్య కుంటలో దూకింది. గమనించిన స్థానికులు మహిళను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News