DWCRA Stree Nidhi Organization: స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్.. వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవల్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 123 పోస్టులకు దరఖాస్తులను కోరుతూ ప్రకటన వెలువరించింది.
ఖాళీల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 123 అసిస్టెంట్ మేనేజర్ (ఫీల్డ్ లెవల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ. 33,960 జీతం ఉండనుంది. దీనితో పాటు ప్రయాణ అలవెన్సులు, పర్ఫార్మెన్స్ ఆధారిత వేరియబుల్ పే అదనం ఉండనున్నట్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
అర్హతలు, వయోపరిమితి: ఆసక్తి గల అభ్యర్థులు కనీసం 65 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ (MS Office) పరిజ్ఞానం తప్పనిసరి. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. దరఖాస్తుదారులకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయస్సు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే బీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు గాను ఎక్జామ్ ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 90 నిముషాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25), రీజనింగ్ (25), ఇంగ్లీష్ (25), బ్యాంకింగ్, జనరల్ అవేర్‌నెస్ (25) చొప్పున మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ:
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
- చివరి తేదీ: మే 29, 2026 (రాత్రి 12 గంటల వరకు).
ఫీజు వివరాలు:
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు: రూ. 770
- ఇతర కేటగిరీల అభ్యర్థులకు: రూ. 885

