NTR statue in Maitreevanam Circle: హైదరాబాద్ అమీర్‌పేట మైత్రీవనం సర్కిల్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. నేడు ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా, ఎన్టీఆర్ జయంతి రోజునే విగ్రహాన్ని ఆవిష్కరించడంతో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, గాంధీతో పాటు ఎన్టీఆర్ కుమారులు నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ, సినీనటుడు మంచు మనోజ్, దర్శకుడు బోయపాటి శ్రీను, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.
Also read: Mukesh Ambani: ఆరేళ్లుగా జీతం తీసుకోకుండా పనిచేస్తున్న అంబానీ.. కారణం తెలిస్తే షాకవుతారు..!

