NVS Reddy appointed as state advisor: తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఎండీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్వీఎస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఎన్వీఎస్ రెడ్డిని హెచ్‌ఎంఆర్‌ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.. మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా శృతి ఓజా, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా కోట శ్రీవాత్సవకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం.రాజారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా రాజేశ్వర్ నియమితులయ్యారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/transgenders-recruited-as-metro-security-guards/

