HomeతెలంగాణOsmania University: 118 మంది ఓయు పరిశోధకులకు సీఎం-ఓయూ నాన్-నెట్ ఫెలోషిప్‌లు..

Osmania University: 118 మంది ఓయు పరిశోధకులకు సీఎం-ఓయూ నాన్-నెట్ ఫెలోషిప్‌లు..

ఉస్మానియా యూనివర్సిటీ (తెలుగు ప్రభ): పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్తికాల పరిశోధక విద్యార్థులకు సీఎం- ఓయూ నాన్-నెట్ ఫెలోషిప్‌ల పంపిణీని వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ప్రారంభించారు. ఈ విడతలో మొత్తం 118 మంది ఫుల్ టైమ్ పరిశోధకులకు నెలకు రూ. 5,000 చొప్పున మొత్తం రూ. 5.90 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విశ్వవిద్యాలయం నిర్దేశించిన అర్హత ప్రమాణాలు పూర్తి చేసి ఇతర ఎలాంటి ఫెలోషిప్ లేదా ఆర్థిక సహాయం పొందని పరిశోధకులకు ఈ ఫెలో షిప్‌లు మంజూరు చేశారు.

- Advertisement -

Also Read: Carry Men Trend: షాపింగ్‌కు కొత్త ట్రెండ్.. ‘క్యారీ మెన్’ సేవలు వైరల్!

వీసీ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ.. పరిశోధకులే విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నవీన ఆవిష్కరణలకు మూల స్తంభాలు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు వారి పరిశోధనలకు అడ్డంకిగా మారకుండా అవసరమైన సహాయాన్ని అందించడం పరిశోధన వసతులను మెరుగుపరచడం పట్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం కట్టుబడి ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ ఎస్. జితేందర్ కుమార్ నాయక్, డీన్ ప్రొఫెసర్ బి.లావణ్య, నోడల్ అధికారి డాక్ట ర్ జె. ఉపేందర్,అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, యూజీ సీ, నాన్-యూజీసీ ఫెలోషిప్ విభాగాల ప్రతినిధులు పాల్గొ న్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News