HomeTop StoriesCM Revanth Reddy: 'ప్రేమలు పంచాల్సిన చోట చట్టం తేవాల్సి రావడం బాధగా ఉంది'

CM Revanth Reddy: ‘ప్రేమలు పంచాల్సిన చోట చట్టం తేవాల్సి రావడం బాధగా ఉంది’

CM Revanth Reddy ‘Parents Bill’: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ప్రేమలు పంచాల్సిన చోట తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేస్తూ చట్టాన్ని తీసుకురావాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను విస్మరిస్తున్నారని.. వారిని గౌరవంగా చూసుకోవడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రభుత్వం “తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు-2026” (తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లు)ను రూపొందించింది. ఆదివారం అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. శాసనసభ ఆమోదం తెలిపింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/pm-narendra-modi-visit-in-kerala-for-assembly-elections/

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని రూపొందిస్తోందని సీఎం రేవంత్‌ అన్నారు. కేవలం భయం కోసం కాకుండా, నైతిక బాధ్యతను గుర్తు చేయడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. ఈ చట్టం ప్రకారం ఉద్యోగులు తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే, వారి నెలవారీ జీతం నుంచి 15 శాతం లేదా గరిష్ఠంగా రూ. 10,000 (ఏది తక్కువైతే అది) కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు. ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారందరికీ వర్తిస్తుంది. సమాజంలో కుటుంబ విలువలు తగ్గుతున్నాయని, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవల్లోకి వచ్చేవారు తప్పనిసరిగా సామాజిక బాధ్యతతో ఉండాలని ఆయన పేర్కొన్నారు.

‘సామాజిక బాధ్యతగా మా ప్రభుత్వం తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు తెచ్చింది. పిల్లలను కనగలం కానీ.. వాళ్ల బుద్ధిని కనలేం అన్నట్టు కొందరి వ్యవహారం ఉంది. ప్రేమలు పంచాల్సిన చోట చట్టం తేవాల్సి రావడం బాధగా ఉంది. భక్తితో లేదా భయంతో అయినా తల్లిదండ్రులను చూసుకోవాలన్నదే మా ఆలోచన. ఉద్యోగులే కాదు ప్రజాప్రతినిధులు కూడా ఈ చట్టంలోకి వస్తారు. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రతి కుమారుడికి బుద్ధి చెప్పాలనే ఈ చట్టం.’ -సీఎం రేవంత్‌

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-about-mla-kadiyam-srihari-in-assembly/

వృద్ధుల కోసం కేంద్రం తీసుకువచ్చిన 2007 నాటి చట్టం కంటే ఈ కొత్త బిల్లు మరింత ప్రభావవంతంగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమన్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News