HomeTop StoriesPM Modi: ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లు వద్దు- ప్రధాని మోదీ అలర్ట్‌

PM Modi: ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లు వద్దు- ప్రధాని మోదీ అలర్ట్‌

PM Narendra Modi: యుద్ధం కారణంగా దేశంలో ఇంధనం సంక్షోభం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయినా ఇంధనం రేట్లు పెంచడం లేదని గుర్తు చేశారు. ప్రజలు పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలని.. మెట్రో సేవలను, ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని.. బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.   

- Advertisement -

‘బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారకత్వం పెరుగుతుంది. ఏడాదిపాటు బంగారం కొనడం తగ్గించుకోవాలి. కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి. తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలి. పౌరులు వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలి. విదేశాల నుంచి భారీగా రసాయన ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాం. రసాయన ఎరువుల వల్ల భూమికి చాలా నష్టం జరుగుతుంది. రసాయన ఎరువులను తగ్గించుకుంటే విదేశీ ద్రవ్యాన్ని మిగిలించుకోగలం.’ -ప్రధాని మోదీ

Also Read: https://teluguprabha.net/telangana/pm-modi-alleges-both-brs-and-congress-are-family-parties/

వ్యవసాయంలో డీజిల్‌కు బదులు సౌర పంపులను ప్రోత్సహిస్తున్నామని మోదీ వెల్లడించారు. వ్యవసాయంలో స్వదేశీ వస్తువులను ఎక్కువగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. నేను స్వదేశీ గురించి చెప్పగానే దీపావళి దీపాలు గురుంచి మాట్లాడుతారని.. దీపాలు కొంటే స్వదేశీని ప్రోత్సహించినట్లు భ్రమల్లో ఉండొద్దని మోదీ స్పష్టం చేశారు. 

Also Read: https://teluguprabha.net/national-news/about-the-new-ministers-of-tamilnadu/

అంతకుముందుగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు చేరుకున్న ప్రధాని మోదీ.. కాన్వాయ్‌ నుంచే కార్యకర్తలకు అభివాదం చేశారు. వేదిక మీద ఉన్న రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని రాకతో గ్రౌండ్‌ పరిసరాల్లో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు, మల్టీ లేయర్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పలు రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News