HomeTop StoriesPM Modi: 'గతంలో ఉమ్మడి రాష్ట్రానికి రూ. 1000 కోట్లు కూడా వచ్చేవి కాదు.. ఇప్పుడు...

PM Modi: ‘గతంలో ఉమ్మడి రాష్ట్రానికి రూ. 1000 కోట్లు కూడా వచ్చేవి కాదు.. ఇప్పుడు తెలంగాణకి 5వేల కోట్లకి పైగా ఇస్తున్నాం’

PM Modi Telangana Visit: గతంలో యూపీఏ హయాంలో గుజరాత్‌కి ఎన్ని నిధులు ఇచ్చారో.. ఇప్పుడు తెలంగాణకి అంతే ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అలా చేస్తే ప్రస్తుతం తెలంగాణకి ఇస్తున్న నిధులు సగానికి పడిపోతాయని పేర్కొన్నారు. కాబట్టి తమతో కలిసి పనిచేయడమే మేలని సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి మోదీ సూచించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమం వేదికగా.. పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో సహా కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ హయాంలో రాష్ట్రానికి కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మోదీ మాట్లాడారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-delhi-tour/

రాష్ట్రంలో రూ. 9,377 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్‌లో పిఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్, జహీరాబాద్‌ సమీకృత పారిశ్రామిక స్మార్ట్ సిటీ, జాతీయ రహదారి ప్రాజెక్టులు, వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను తెలంగాణకు అందిస్తున్నట్లు ప్రకటించారు. గుడెబల్లూర్-మహబూబ్‌నగర్‌ 4 లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

సైబరాబాద్‌ సామర్థ్యం అంతర్జాతీయమైనదని ప్రధాని మోదీ కొనియాడారు. దేశాభివృద్ధిలో నగరం కీలకపాత్ర పోషిస్తోందని వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుందని.. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని ప్రశంసించారు. వరంగల్‌ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్‌టైల్స్‌ రంగానికి ఊతమిస్తుందని చెప్పారు. దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

Also Read: https://teluguprabha.net/telangana/telangana-will-develop-faster-if-modi-has-blessings/

‘తెలంగాణకు 5 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 6 అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. రాజకీయాలు మాట్లాడనని రేవంత్‌ అన్నారు, నేను కూడా మాట్లాడను. పదేళ్లలో గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చేందుకు సిద్ధం. రాష్ట్రంలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి. రేవంత్‌రెడ్డి నా మాట శ్రద్ధగా వినండి. 2014కి ముందు ఏపీకి వెయ్యి కోట్ల కంటే తక్కువ రైల్వే బడ్జెట్‌ ఉండేది. ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకే రూ. 5,500 కోట్లు రైల్వే పనులకు కేటాయించాం. రూ. 15 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి.- ప్రధాని మోదీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News