HomeతెలంగాణPochampally Ikkat: తెలంగాణ చేనేతకు అంతర్జాతీయ గౌరవం.. ప్యారిస్ ఫ్యాషన్ షోలో పోచంపల్లి ఇక్కత్!

Pochampally Ikkat: తెలంగాణ చేనేతకు అంతర్జాతీయ గౌరవం.. ప్యారిస్ ఫ్యాషన్ షోలో పోచంపల్లి ఇక్కత్!

Paris fashion show: తెలంగాణ చేనేత కళా వైభవం మరోసారి ప్రపంచ వేదికపై మెరవనుంది. ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ఈ నెల 17 నుండి 21 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) వేడుకల్లో మన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ సీఈవో తడక రమేశ్‌ తెలిపారు.

- Advertisement -

గ్లోబల్ స్టేజ్‌పై రష్మిక ఠాగూర్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న రష్మిక ఠాగూర్ ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షోలో పాల్గొననున్నారు. ఆమె పోచంపల్లి ఇక్కత్ డిజైన్లతో రూపొందించిన వస్త్రాలను ధరించి క్యాట్ వాక్ చేయనున్నారు. తద్వారా మన చేనేత గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయనున్నారు.

Also read-Telangana: లండన్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. కౌన్సిలర్‌‌గా విజయం

గర్వకారణంగా స్పాన్సర్‌షిప్: ఈ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలో ఉపయోగించే వస్త్రాలకు మరియు ఇక్కత్ డిజైన్లకు స్పాన్సర్‌గా వ్యవహరించే అవకాశం రావడం పట్ల రమేశ్‌ సంతోషం వ్యక్తం చేశారు. “మన చేనేత కళాకారుల అద్భుతమైన నైపుణ్యం అంతర్జాతీయ వేదికపై ప్రదర్శితం కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఇది భవిష్యత్తులో కళాకారుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపుతుంది,” అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News