Minor Girl Delivery in Nagarkurnool: తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో సంచలనం సృష్టించిన కేజీబీవీ విద్యార్థిని ప్రసవం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బాధితురాలు తోటి విద్యార్థిపై నెపం మోపి, బంధువును కాపాడే యత్నం చేయగా.. డీఎన్‌ఏ పరీక్ష చేస్తామని పోలీసులు పేర్కొనడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
నాగర్‌కర్నూల్‌లోని ఒక కేజీబీవీ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక స్కానింగ్ సెంటర్‌లోనే ప్రసవించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. మార్చి 4న వైద్య పరీక్షల కోసం ఒక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌కు వెళ్లిన సమయంలో అక్కడి వాష్‌రూమ్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక గర్భానికి కారకుడైన వివాహితుడైన బంధువును కాపాడేందుకు బాలిక యత్నించి.. ఆ నెపాన్ని తోటి విద్యార్థిపై నెట్టేందుకు ఆమె యత్నించింది. బాలిక తనతో పాటు చదివే ఒక విద్యార్థి కారణమని చెప్పింది. అయితే పోలీసులు డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని చెప్పడంతో అసలు నిజాన్ని వెల్లడించింది. తన బంధువు అయిన గంగరాజు వల్లే తాను గర్భవతినయ్యానని ఆమె షాకింగ్ విషయం వెల్లడించింది. దీంతో నిందితుడు గంగరాజుపై పోక్సో కేసు నమోదు చేసిన అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Also Read: https://teluguprabha.net/telangana/central-decides-to-distribute-3-months-ration-rice-at-a-time/
అంతకుముందు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పదో తరగతి పరీక్షల సమయంలో పరిచయమైన ఓ బాలుడి వల్లే తాను గర్భవతిని అయ్యానని బాలిక పేర్కొంది. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు బాలికతో పరిచయం, చాటింగ్ ఉన్న మాట వాస్తవమే కానీ, అంతకుమించి మరేమీ లేదని బాలుడు వెల్లడించాడు. దీంతో డీఎన్‌ఏ పరీక్ష పేరు చెప్పి.. అసలు నిందితుడి పేరును బాధితురాలి నుంచి బయటకు తీసుకువచ్చారు.
అయితే ఈ ఘటన పాఠశాల అధికారుల పర్యవేక్షణపై పలు ప్రశ్నలను లేవనెత్తింది, 9 నెలల పాటు విద్యార్థిని గర్భంతో ఉన్న విషయాన్ని వారు గుర్తించలేకపోవడం గమనార్హం.

