సూర్యాపేట, అక్టోబర్ 3 (తెలుగుప్రభ): పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేడు ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత పోలీస్ శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్, ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నేడు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్షా కేంద్రాలు..
సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల, కోదాడలోని కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల, హుజూర్‌నగర్‌లోని గ్రీన్‌వుడ్ పాఠశాలలో పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే తిరుమలగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పరీక్ష ఉంటుంది. ఆయా పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

