HomeTop StoriesPonguleti Srivivas reddy: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు

Ponguleti Srivivas reddy: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు

Ponguleti on Indiramma’s house: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసే వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. జూన్‌ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆదిలాబాద్‌లో ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం గృహనిర్మాణశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

డబుల్‌ బెడ్‌రూమ్‌ల కేటాయింపు కోసం స్పెషల్‌ డ్రైవ్‌..

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల విధివిధానాలను ఈనెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. హైదరాబాద్‌లో స్థలాలు ఉన్నవారికి ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

Also read: https://teluguprabha.net/national-news/vijay-meets-with-aidmk-rebel-mlas/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News