HomeTop StoriesProf K Nageshwar: అదే జరిగితే నా ఆత్మకథ రాసుకుంటా..! ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు

Prof K Nageshwar: అదే జరిగితే నా ఆత్మకథ రాసుకుంటా..! ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు

Prof K Nageshwar Sensational Comments: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై జనసైనికులు మండిపడుతున్నారు. అంతేకాదు, వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసులు పెట్టారు. అయితే, ఈ వివాదం అనంతరం నాగేశ్వర్ తన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ, జనసేన నేతలు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా, ఏపీ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌ ఇంటికి వచ్చారని, ఆయన అరెస్ట్ కాబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఇవాళ ప్రెస్‌మీట్‌ పెట్టి తనపై నమోదైన కేసులపై ఘాటుగా స్పందించారు.

- Advertisement -

Also read: Peddi Movie: తెలంగాణలో రెంటల్‌ విధానంలోనే పెద్ది ప్రదర్శన.. మెగాస్టార్‌ జోక్యంతో వివాదానికి ఎండ్‌కార్డ్‌..!

కులాల ప్రస్తావనే తేలేదు.. అయినా కేసులు..!

తనపై పెట్టిన కేసులను చూస్తే నవ్వొస్తోందని, తాను మాట్లాడిన మాటల్లో ఎక్కడా కులం ప్రస్తావనే లేదని, అలాంటప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టానంటూ కేసులు ఎలా నమోదు చేస్తారని సూటిగా ప్రశ్నించారు. అసలు కులం, ప్రాంతం ప్రస్తావనలను తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల వల్ల అల్లర్లు జరిగాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తన అరెస్ట్‌పై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ.. ఏపీ పోలీసులకు, ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. “మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. టైమ్, ప్లేస్ చెబితే నేనే అక్కడికి వస్తాను. మీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు. యుద్ధం మీరు మొదలుపెట్టారు, ఇప్పుడు నేను ముగిస్తా. ప్రజా సమస్యలపై నా యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. చావుకైనా సిద్ధపడతా కానీ నా భావప్రకటనా స్వేచ్ఛను మాత్రం వదులుకోను.”అని నాగేశ్వర్ స్పష్టం చేశారు.

జీవితంలో ఎన్నో చూశా.. అరెస్టులకు భయపడను..!

ఒకవేళ, తనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే తాను పూర్తిగా సహకరిస్తానన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తాను ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించలేదని, కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేశారు. విద్యార్థి ఉద్యమాల్లో, ప్రజా పోరాటాల్లో, ఎమ్మెల్సీగా చట్టసభల్లో, మీడియా రంగంలో అపార అనుభవం ఉన్న నాకు.. ఇప్పటివరకు ‘జైలు జీవితం’ అనుభవం మాత్రం లేదన్నారు. ఒకవేళ, ఇప్పుడు అరెస్ట్ జరిగి జైలుకు వెళ్లాల్సి వస్తే.. ఆత్మకథ రాసుకుంటానని వ్యాఖ్యానించారు. తాను ప్రపంచంలో ఎక్కడ అణచివేత జరిగినా స్పందించానని, తన గొంతును నొక్కడం ఎవరి తరం కాదన్నారు. అరెస్టులకు భయపడే వ్యక్తిని కాదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News