HomeతెలంగాణProfessor Nageshwar: డీజీపీని కలిసిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌.. వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

Professor Nageshwar: డీజీపీని కలిసిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌.. వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

Professor Nageshwar Meets DGP CV Anand: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను ఇప్పటికే విత్‌డ్రా చేసుకున్నప్పటికీ.. సోషల్‌మీడియాలో తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని.. అయినా తనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదులో వాపోయారు.

- Advertisement -

Also read: Karnataka CM : కర్ణాటక సీఎం మార్పుపై జోరుగా చర్చ.. సిద్ధరామయ్యకు ఢిల్లీలో ఆ పదవి ఆఫర్‌? 

వివాదం ఎక్కడ మొదలైంది?

ఇటీవల, ఓ టీవీ ఛానెల్‌లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో, నాగేశ్వర్‌ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణకు చేరుకున్నారంటూ ప్రచారం జరిగింది. దాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఇదంతా ఫేక్‌ ప్రచారమని కొట్టి పారేసింది. అయినప్పటికీ, సోషల్‌ మీడియా వేదికగా తనపై కొంతమంది కావాలనే దుష్ట్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News