Rain forecast: గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాతావరణ మార్పుల వల్ల ఎండల తీవ్రత తగ్గి.. వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అల్పపీడన సంకేతాలు: ఈ నెల రెండో వారంలో నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది మరింత బలపడి మే 11 లేదా 12 తేదీల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వేసవి తాపం నుంచి ఉపశమనం లభించనుంది.
Also read-TDP: మహానాడు వేదిక, తేదీలు ఫిక్స్.. జోష్‌లో టీడీపీ శ్రేణులు!
రాబోయే 48 గంటలు కీలకం: ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

