HomeతెలంగాణExplosion : సింగరేణి గనిలో సిలిండర్‌ పేలుడు.. ఐదుగురికి తీవ్రగాయాలు

Explosion : సింగరేణి గనిలో సిలిండర్‌ పేలుడు.. ఐదుగురికి తీవ్రగాయాలు

Singareni ALP coal mine explosion: నిత్యం వేలాది టన్నుల బొగ్గు ఉత్పత్తితో రద్దీగా ఉండే ఆ గనిలో క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. గని గర్భంలో విధులు ముగించుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటామనుకున్న కార్మికుల ఆశలపై పిడుగు పడింది. అసలు పటిష్ఠమైన రక్షణ చర్యలు ఉండే ప్రాజెక్టులో ఆ ఎయిర్‌ట్యాంక్ ఎందుకు పేలింది? సాంకేతిక లోపమా లేక భద్రతా నిబంధనలను గాలికొదిలేశారా?

- Advertisement -

పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని సింగరేణి ఆండ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్ (ఏఎల్‌పీ) బొగ్గు గనిలో గురువారం తీవ్ర కలకలం రేగింది. బొగ్గు వెలికితీత విధుల్లో భాగంగా యూఎఫ్‌బీఎల్‌ (UFBL) ఎయిర్‌ట్యాంక్‌లోకి గ్యాస్ నింపుతుండగా ఊహించని రీతిలో ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

రక్తసిక్తమైన ఘటనా స్థలం: పేలుడు ధాటికి విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులు—శ్రీనివాస్, కిరణ్, లక్ష్మణ్, ప్రశాంత్‌, మనోజ్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని పరికరాలు చెల్లాచెదురై, ఘటనా స్థలంలో కార్మికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. తోటి కార్మికుల గుండెల్లో గుబులు రేగడంతో ప్రాణభయంతో పరుగులు తీశారు.

హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు: సమాచారం అందుకున్న వెంటనే గని రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.  క్షతగాత్రులను రక్షించి, ప్రాథమిక చికిత్స అనంతరం హుటాహుటిన గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ దుర్ఘటనపై సింగరేణి యాజమాన్యం, మైన్స్ సేఫ్టీ అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News