HomeతెలంగాణMulugu: రామప్పను సందర్శించిన పోర్చుగల్ దేశస్థులు

Mulugu: రామప్పను సందర్శించిన పోర్చుగల్ దేశస్థులు

ములుగు, అక్టోబర్ 11 (తెలుగు ప్రభ): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం పోర్చుగల్ దేశస్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రామప్ప దేవాలయ చరిత్ర, శిల్పకళా వైభవం గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు అరుణ్ కుమార్, శ్రీనివాస్, శ్రీకాంత్, భద్రు, దేవాదాయ, పురావస్తు, పర్యాటక శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News