Murder in Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్ సమీపంలోని తోల్‌కట్ట అటవీ ప్రాంతంలో ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన ఈ మహిళలు ఇటీవల అదృశ్యం కాగా.. శనివారం మొయినాబాద్ పరిధిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
Also Read: https://teluguprabha.net/national-news/army-chief-upendra-dwivedi-warning-to-pakistan/
వృద్ధురాళ్లు గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తాండూరులో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాంకేతిక ఆధారాలు, మొబైల్ సిగ్నల్స్ ట్రాక్ చేయగా వారు మొయినాబాద్ వైపు వచ్చినట్లు నిర్ధారణ అయింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో వీరిద్దరూ రక్తపు మడుగులో శవాలై కనిపించారు. వీరి వయసు దాదాపు 60 ఏళ్లు పైబడే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/kavitha-letter-to-pm-modi-on-bandi-sanjay/
ఘటనా స్థలానికి చేరుకున్న తాండూరు మరియు మొయినాబాద్ పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఫైనాన్స్, వడ్డీ డబ్బుల గొడవలే ఈ జంట హత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. డబ్బులు ఇస్తామని నమ్మించి, ప్రణాళిక ప్రకారం వారిని వికారాబాద్ నుంచి మొయినాబాద్‌కు రప్పించి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

