- ఆగస్టు 3తో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు గడువు ముగింపు
- ఎన్యుమరేషన్ ఫారం సమర్పణ తప్పనిసరి
- చివరి నిమిషం వరకు వేచి ఉండవద్దన్న పవన్ సాయి
- అవసరమైతే తన బృందం సహాయం అందిస్తుందని హామీ
రాజేంద్రనగర్ (తెలుగు ప్రభ): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ముగింపుకు చేరుకుంది. ఆగస్టు 3తో ఎన్యుమరేషన్ ఫారం సమర్పణకు గడువు ముగియనున్నందున ఇప్పటికీ ఫారం నింపని అర్హులైన ఓటర్లు వెంటనే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ బండ్లగూడ జాగీర్ ప్రధాన కార్యదర్శి నీరుడు పవన్ సాయి విజ్ఞప్తి చేశారు. ఎన్యుమరేషన్ ఫారం సమర్పించడంలో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఓటరు జాబితాలో పేరు కొనసాగింపుపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫారం పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు లేదా రద్దీ కారణంగా అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చని పేర్కొన్నారు. ఫారం నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తనను లేదా తన బృందాన్ని సంప్రదిస్తే అవసరమైన సహాయం అందిస్తామని పవన్ సాయి తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమని, గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
Also read: Cabinet : సౌర సరోవరంలో కాంతుల కేళిక… సాగు భూముల్లో సిరుల హరివిల్లు! కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

