Fire Accident Manikonda: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.
రిద్ధీస్ గ్రాండియర్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో టౌన్‌షిప్ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఫ్లాట్‌లోని వాషింగ్ మెషీన్‌కు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన ఫ్లాట్ యజమాని.. భార్య, పిల్లలతో వెంటనే బయటకు రావడంతో సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-second-day-mi-vs-kkr-match/
హైదరాబాద్‌లో ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వాషింగ్ మెషీన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్‌ల పట్ల, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

